బిగ్‌బాస్ హోస్ట్ ఛేంజ్.. అందాల తారకు అవకాశం

బిగ్‌బాస్ 4 బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తోన్న షో. అత్యధిక రేటింగ్‌తో దూసుకుపోతోందని హోస్ట్ నాగార్జున అన్నారు. శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి సందడి చేస్తూ ఆడియన్స్‌ని, హౌస్‌లోని సభ్యులను అలరిస్తుంటారు. ఈ నేపథ్యంలో హోస్ట్ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో బ్యూటీ క్వీన్ రమ్యకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. రమ్యకృష్ణకు ముందు ఎన్టీఆర్, నానిలతో పాటు నాగచైతన్యను కూడా సంప్రదించగా వారంతా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండి బిగ్ బాస్ ఆఫర్‌ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
దీంతో రమ్యకృష్ణకు హోస్ట్ చేసే అవకాశం దక్కింది. బిగ్‌బాస్ ప్రపోజల్‌పై ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈరోజు సాయింత్రం వచ్చే ఎపిసోడ్‌లో రమ్య దర్శనమివ్వబోతోందని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లారు. ప్రత్యేక విమానంలో వచ్చి బిగ్‌బాస్ షూట్ చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ ఎవరనేది క్లారిటీ వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com