రమ్య @ 50.. వాటే బ్యూటీ..: ఫ్యాన్స్ కామెంట్స్

రమ్య @ 50.. వాటే బ్యూటీ..: ఫ్యాన్స్ కామెంట్స్
నా ప్రియమైన, అందమైన రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాఘవేంద్రరావు ట్వీట్ చేయగా..

వయసు పెరుగుతున్న కొద్ది అందం పెరగడం ఒక్క రమ్య కృష్ణలోనే జరుగుతోందా.. అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.. బొద్దుగా ఉన్నా ముద్దుగా ముచ్చటగా ఉంది అనుకున్నారు ఆమె కొంచెం లావుగా కనిపించినా.. మళ్లీ అంతలోనే స్లిమ్ గా తయారయ్యారు.. నేటి హీరోయిన్లతో పోటీ పడే అందం, ఆహార్యంతో. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన రమ్య.. నేటికీ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. ఇప్పటి వరకు రమ్య నాలుగు భాషల్లో 260 చిత్రాల్లో నటించారు. మంగళవారం తన 50వ పుట్టిన రోజును కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్న రమ్య.. 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టానంటూ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి రమ్య పుట్టిన రోజు శుభాకాంక్షలందుకున్నారు. ఆమెకు 50 ఏళ్లంటే అస్సలు నమ్మలేకపోతున్నాం అని అభిమానులు రమ్యకు పోస్టులు పెడుతున్నారు. ఏ మాత్రం అలా లేరు.. మీ గ్లామర్ అస్సలు తగ్గలేదు.. చాలా యంగ్ గా కనిపిస్తున్నారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రమ్యకు తనదైన శైలిలో విషెస్ తెలియజేశారు.. రోజ్ రోజ్ రోజా పువ్వు నుంచి మమతల తల్లి వరకు.. ఇన్నాళ్ల మన ప్రయాణం ఓ అద్భుతం.. మరిన్ని చక్కటి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా.. నా ప్రియమైన, అందమైన రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాఘవేంద్రరావు ట్వీట్ చేయగా, మరో దర్శకుడు.. డైనమిక్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. నాకెంతో ఇష్టమైన, ఎవర్ గ్రీన్ రమ్యజీకి జన్మదిన శుభాకాంక్షలు.. ఎప్పటిలాగే మాకు వినోదం పంచాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.

Tags

Next Story