Eid ul Fitr 2021 : దేశవ్యాప్తంగా రేపే రంజాన్‌..!

Eid ul Fitr 2021  : దేశవ్యాప్తంగా రేపే రంజాన్‌..!
X
గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ పండుగను గురువారం జరుపుకుంటున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఈద్‌ ప్రార్థనల కోసం ఈద్గాలు, మసీదులకు వెళ్లరాదని తెలంగాణ వక్ఫ్‌ బోర్డు స్పష్టం చేసింది.

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ దేశవ్యాప్తంగా శుక్రవారం జరగనుంది. బుధవారం నెల వంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్‌ ఉపవాస దీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్‌ జరుపుకోవాలని రువాయత్‌-ఎ-హిలాల్‌ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌తో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించారు. గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ పండుగను గురువారం జరుపుకుంటున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఈద్‌ ప్రార్థనల కోసం ఈద్గాలు, మసీదులకు వెళ్లరాదని తెలంగాణ వక్ఫ్‌ బోర్డు స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Tags

Next Story