'విరాటపర్వం'లో రానా కంటే ముందు..: సాయిపల్లవి

విరాటపర్వంలో రానా కంటే ముందు..: సాయిపల్లవి
X
తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దర్శకులు తన పాత్రను

ఎవరు అవునన్నా కాదన్నా లింగ వివక్ష ఏ రంగంలో అయినా ఉంటుంది. అది సినిమా రంగంలో కొన్ని పాళ్లు ఎక్కువే. లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువ. ఆమెను ఓ గ్లామర్ డాల్‌గా చూపించడానికే దర్శకులు ప్రాధాన్యం చూపుతారు.. అయితే ఈ మధ్య కొందరు దర్శకులు నటీ మణులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వారి కోసమే కథను సిద్ధం చేస్తుంటారు. నయనతార, అనుష్క శెట్టి వారు పోషించిన లీడ్ రోల్స్ నిర్మాతలకు కాసులు కురిపించాయి.

ఈ మార్పు ఆహ్వానించదగినది అని మోస్ట్ టాలెంటెడ్ నటి సాయిపల్లవి అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో దర్శకులు తన పాత్రను ఎలివేట్ చేసే క్యారక్టర్లు ఇచ్చారని చెప్పింది. రాబోయే రోజుల్లో నటీ నటులకు సమాన ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇక తాజాగా తాను చేసిన విరాటపర్వం గురించి మాట్లాడుతూ.. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న 'విరాటపర్వం'లో ఓ ముఖ్యమైన పాత్రను పోషించినట్లు చెప్పారు.

ఇందులో దగ్గుబాటి రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి పల్లవి.. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల పరిధి ఎక్కువగా ఉన్నప్పటికీ, హీరో పేరు ఎప్పుడూ పైనే ఉంటంది. ఆ విషయం మేం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మా అభిప్రాయంతో చిత్ర యూనిట్‌కి సంబంధం ఉండదు. అయితే అందుకు భిన్నంగా చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని భావించిన రానా టైటిల్ కార్డులో నా పేరు ఉండాలని చెప్పారు. ఈ విషయం గురించి నేను అసలు ఆలోచించలేదు.. నా పాత్ర పరధి మేరకు నటించి వచ్చేశాను.

కానీ రానా దాని గురించి ఆలోచించారు. రానా సమానత్వాన్ని నమ్ముతాడు. అందుకే టైటిల్ కార్డులో అతడి పేరు కంటే ముందు తన పేరు ఉంటుందని సాయి పల్లవి తెలిపారు. అతడితో పని చేయడం నాకు దొరికిన ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సెట్స్‌లో ఉన్నప్పుడు కూడా అందర్నీ నవ్విస్తూ ఒక ఆహ్లాదవాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అని రానా గురిచి సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

Tags

Next Story