Randeep Hooda: అంత్యక్రియలు నిర్వహించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నటుడు..

Randeep Hooda:అతడిలో ఆమె తన సోదరుడిని చూసుకుంది.. అందుకే తాను మరణిస్తే తమ్ముడిలా అంత్యక్రియలు నిర్వహించమని కోరింది. ఆమె మాటను శిరసావహించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాడు బాలీవుడ్ హీరో రణదీప్ హుడా. సరబ్‌జిత్ చిత్రంలో.. నటుడు రణదీప్ హుడా సరబ్‌జిత్ సింగ్ పాత్రను పోషించాడు.
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు సరబ్‌జిత్‌కు మరణశిక్ష విధించింది. షూటింగ్ సమయంలో రణదీప్ హుడాకు సరబ్జిత్ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ కారణంగానే అతడి సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్. నీలో నా సోదరుడిని చూసుకున్నాను.. నాకు 'కంథ' ( శవాన్ని దహన సంస్కారానికి తీసుకెళ్లేటప్పుడు పాడెను మోయడం) ఇవ్వాలని అభ్యర్థించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలోని భిఖివింద్‌లో ఆదివారం ఆమె గుండెపోటుతో మరణించింది. సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌కి ఇచ్చిన మాట ప్రకారం రణదీప్ అంత్యక్రియలకు హాజరై కార్యక్రమాలు నిర్వహించాడు..
ఈ విషయాన్ని రణదీప్ హుడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. అతను ఇలా వ్రాశాడు, " ఘర్ జరూర్ ఆనా అని ఆమె చివరిగా చెప్పింది. నేను వెళ్ళాను, కానీ ఆమె లేదు.. నన్ను వదిలేసి ఆమె మాత్రమే వెళ్లిపోయింది. దల్బీర్ కౌర్ జీ ఇంత త్వరగా మనల్ని విడిచిపెడతారని ఎవరూ ఊహించలేరు. పోరాట యోధుడు, అంకితభావం ఉన్నవాడిని ఆమె పెంచి పెద్ద చేసింది. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్జిత్‌ను రక్షించడానికి ఒక వ్యవస్థను నెలకొల్పింది.
రణదీప్ హుడా పోస్ట్‌ను ముగిస్తూ.. "ఆమె ప్రేమను, ఆశీర్వాదాన్ని పొందిన నేను చాలా అదృష్టవంతుడిని. ఆమె నా చేతికి కట్టిన రాఖీని నేను ఎప్పటికీ కోల్పోలేను. మేము చివరిసారిగా పంజాబ్ పొలాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు కలుసుకున్నాము. అది ఇండో-పాక్ సరిహద్దు. నవంబర్ చివరి రాత్రి చల్లగా, దట్టమైన పొగమంచుతో ఉంది. కానీ ఆమె అవన్నీ పట్టించుకోలేదు. దల్బీర్ జీ.. నేను మీ ప్రేమను, ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను అని పోస్ట్ ముగించారు రణదీప్.
ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన సరబ్జిత్ చిత్రంలో దల్బీర్ కౌర్ పాత్రను ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com