Rani Laxmi Bai: ఝన్సీ రాణి కుమారుడు ఏమయ్యాడు.. అతని వెనకున్న కథేంటి..

Rani Laxmi Bai (tv5news.in)

Rani Laxmi Bai (tv5news.in)

Rani Laxmi Bai: మనం ఝాన్సీ రాణి విగ్రహం ఎక్కడ చూసినా.. దాదాపు చాలాచోట్ల తనతో పాటు వీపులో పిల్లవాడు కూడా ఉంటాడు.

Rani Laxmi Bai: ఆడవారు మీరేం చేయగలరు..? అని ప్రశ్ని్ంచే ప్రతీ ఒక్కరికీ ఇప్పటికి ఎంతోమంది ఆడవాళ్లు ఎన్నో సాధించి సమాధానం చెప్పారు. ఇప్పటి కాలంలోనే ఎప్పటినుండైనా ఆడవారు ఏమైనా చేయగలరు. కావాలంటే ఒకపక్క పిల్లలను చూసుకుంటూనే ఒంటి చేతితో యుద్ధం కూడా చేయవచ్చు. అలా చేసి రాజ్యాన్ని కూడా నిలబెట్టవచ్చు అని నిరూపించిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మిభాయ్. ఇంతకీ యుద్ధంలో తనతో పాటు భయపడకుండా నిలబడిన ఆ పిల్లాడు ఏమయ్యాడు అన్న ప్రశ్న అందరిలో ఆసక్తిని పెంచేస్తోంది.

మనం ఝాన్సీ రాణి విగ్రహం ఎక్కడ చూసినా.. దాదాపు చాలాచోట్ల తనతో పాటు వీపులో పిల్లవాడు కూడా ఉంటాడు. ఇంతకీ ఎవరు అతను..? ఇప్పుడు ఏమయ్యాడు..? అన్న ప్రశ్నలకు కొంతమంది వారికి తెలిసిన సమాధానం ఇస్తున్నారు. ఆ బాలుడి పేరు దామోదర్‌రావు. 1849 నవంబరు 15న జన్మించిన ఆ బాలుడిని ఝన్సీ రాణి దంపతులు దత్తతు తీసుకున్నారు. కానీ దత్తతుకు ఈస్ట్ ఇండియా ఒప్పుకునే ముందే ఝాన్సీ రాణి భర్త గంగాధర్‌రావు మరణించారు.

ఆ తర్వాత ఝాన్సీ రాణి ఎంత ప్రయత్నించినా వారు దత్తతకు ఒప్పుకోలేదు. అంతలోనే తన రాజ్యాన్ని కైవసం చేసుకునేందుకు కుట్రలు మొదలయ్యాయి. తన రాజ్యాన్ని తెల్లవారి చేతిలో పెట్టడానికి ఇష్టపడని ఝన్సీ ధైర్యంగా వారికి ఎదురెళ్లింది. తన సైన్యంలో ఎంతమంది మరణించినా.. ఎందరి రక్తం తన నేలపై పడినా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కానీ గ్వాలియర్‌లో ఓ వంచకుడి మోసంతో వీరమరణం పొందింది.

ఆ యుద్ధ సమయంలో కూడా ఝన్సీ భుజాన తన కొడుకు అనుకున్న దామోదర్‌రావును భుజాన ఎత్తుకునే ఉంది. ఆమె మరణం తర్వాత ఝన్సీ నమ్మినబంట్లు ఆ పిల్లాడిని కాపాడారు. బ్రిటీష్ వారిని తప్పించుకుంటూ 9 ఏళ్ల దామోదర్‌రావును తీసుకొని దగ్గర్లో ఉన్న బుందేల్‌ఖండ్‌ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ బాలుడిని ఎక్కడికి తీసుకెళ్లినా బ్రిటీష్ గూఢచారులు ఉంటారన్న భయంతో చాలాకాలం వరకు ఆ అడవిలోనే జీవించారు.

చాలాకాలం తర్వాత అడవి దగ్గర్లోని ఓ గ్రామ పెద్ద సాయంతో ఓ వైద్యుడిని పిలిపించుకుని దామోదర్‌రావుకు వైద్యం చేయించారు. ఆ తర్వాత అడవుల నుండి బయటపడే సమయంలో బ్రిటీష్ గూఢాచారుల కంటపడ్డారు. వారందరికీ క్షమాభిక్ష పెట్టి మూడునెలలు జైలు శిక్ష వేశారు. అలా జీవితం మొత్తం కష్టాలతోనే సావాసం చేసిన దామోదర్‌రావు 1906 మే 28న తన 58వ ఏట అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఇండోర్‌లోనే మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story