Rare Vulture: వందేళ్ల రాబందు.. కాన్పూర్‌లో కనువిందు

Rare Vulture: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అరుదైన పక్షి కనువిందు చేసింది.ఈద్గా శ్మశానవాటికలో కనిపించిన తెల్లటి హిమాలయ రాబందు స్థానికులను ఆకట్టుకుంది. దాదాపు 5 అడుగుల రెక్కలు కలిగిన రాబందు వయసు దాదాపు వందేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ రాబందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హిమాలయ గ్రిఫన్ రాబందు ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. చాలా పెద్దగా ఉండే ఈ హిమాలయ రాబందు..సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లోనే మాత్రమే కనిపిస్తుంటుంది.ఈ రాబందు 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో..వేల కిలోమీటర్ల దూరం చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. టిబెట్,కాబూల్,భూటాన్,ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు పశ్చిమ చైనా, మంగోలియా, హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది.సౌత్ యూరప్,నార్త్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి 125 సెంటీమీటర్లు ఎత్తు..8 నుంచి 9 అడుగుల పొడవైన రెక్కలను కలిగి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com