జాతీయం

ప్లీజ్ ఆపండి.. : రతన్ టాటా రిక్వెస్ట్

ఎవరు ఇలాంటి పిలుపు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ప్లీజ్ ఆపండి.. : రతన్ టాటా రిక్వెస్ట్
X

Ratan Tata-Bharat Ratna: ఆపేయండి..! ప్లీజ్ ఇలాంటివి చేయొద్దు అంటూ రతన్ టాటా విజ్ఞప్తి చేస్తున్నారు. దేనికోసమంటారా..సోషల్ మీడియాలో ఓ వర్గం ఉంటుంది కదా కొంతమందిపై వీరాభిమానంతో కొందరు, ఏ పనీ లేనట్లూ తమ వ్యూస్ కోసమో..పాపులారిటీ కోసమో మరి కొందరు, కొన్ని రకాల అంశాలపై హ్యాష్‌ట్యాగ్‌లు, పిటీషన్లు పెడుతుంటారు. అలాంటి గ్రూపుల్లో ఒకటి ఇప్పుడు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు రతన్‌టాటాకి భారతరత్న ఇవ్వాలంటూ ఓ మూమెంట్ స్టార్ట్ చేసింది. ఐతే దీన్ని రతన్ టాటా సీరియస్‌గా తీసుకున్నారు, దేశం క్షేమం, అభివృద్ధి చెందడమే తనకి ముఖ్యమని, దేశాభివృద్ధిలో కొంతైనా తన కంట్రిబ్యూషన్ ఉన్నందుకు హ్యాపీ అని చెప్పారు. అంతేకానీ ఇలాంటి డిమాండ్లు సమంజసం కాదని..ఎవరు ఇలాంటి పిలుపు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

అంతేకాదు సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారో..వారికి ఇది క్యాంపెయిన్ కాదని..తనకి పెయిన్ కలిగించే కార్యక్రమం అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. దయచేసి వాటిని ఆపేయమని కోరాడీ పెద్దాయన. భారతరత్న కంటే భారత్‌ కోసం కృషి చేయడమే తనకి దక్కిన భాగ్యంగా వర్ణించారు. యంగ్ అచ్చీవర్స్‌కి రోల్ మోడల్‌గా నిలిచిన రతన్‌టాటా, తమపై తమకి నమ్మకం ఉంచడమే సక్సెస్‌కి మూలసూత్రంగా చెప్తారు

ఐతే నవ్వొచ్చే విషయం ఏమిటంటే, ఈ క్యాంపెయిన్ ఆపేయండంటూ రతన్‌టాటా చెప్పిన తర్వాత కూడా.." చూశారా..చూశారా మీ వినయం, మీ గొప్పతనం అంటే ఇదే, అందుకే మీకు భారతరత్న ఇవ్వాలి" అంటూ కొందరు చెప్తుంటే..మరి కొందరు మీరెప్పుడూ మాకు ఇన్స్‌పిరేషన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ratan tata bharat ratna twitter top compaign social media

Next Story

RELATED STORIES