21 ఏళ్ల వయసుకే ఇద్దరు పిల్లలు.. పెళ్లి కాదన్నారు: రవీనా టాండన్

21 ఏళ్ల వయసుకే ఇద్దరు పిల్లలు.. పెళ్లి కాదన్నారు: రవీనా టాండన్
పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నందున నన్ను ఎవరూ వివాహం చేసుకోరని అనేవారు.

బాలీవుడ్ నటి రవీనా టాండన్ 1994 లో ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు.

వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కోరికతో, రవీనా టాండన్.. పూజ, చాయ అనే ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. సమాజం తన నిర్ణయాన్ని తిరస్కరించినా బాధపడకుండా తాను పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలకి అందమైన భవిష్యత్తుని ఇవ్వాలనుకుంది. వాళ్లిప్పుడు పెరిగి పెద్దయ్యారు. చిన్న కుమార్తె చాయ ఎయిర్ హోస్టెస్ కాగా, పెద్ద కుమార్తె పూజ ఈవెంట్ మేనేజర్‌గా ఎదిగి అమ్మ రవీనా ఆశయాన్ని నెరవేరుస్తున్నారు. పూజకు పెళ్లైంది ఒక బాబు కూడా పుట్టాడు.

రవీనా టాండన్ వివాహం, పిల్లలు

రవీనా 1994 లో పూజా, చాయా అనే ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకుంది. దాదాపు ఒక దశాబ్దం తరువాత రవీనా 2004 లో సినీ నిర్మాత అనిల్ తడానిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కుమార్తె రాషా (14), కుమారుడు రణబీర్ (11) ఉన్నారు.

రవీనా తాను దత్తత తీసుకున్న నేపథ్యాన్ని వివరిస్తూ..

"అది మొహ్రాంకు ముందు (1994). మా అమ్మ, నేను వీకెండ్స్‌లో ఆశా సదన్ వంటి అనాథాశ్రమాలను సందర్శించేవాళ్ళం. నా కజిన్ మరణించినప్పుడు అతడికి ఇద్దరు కుమార్తెలు చాయా, పూజలు ఉన్నారు. తండ్రి మరణంతో ఒంటరి అయిన పిల్లలను సంరక్షకులు చూసే విధానం నాకు నచ్చలేదు. దాంతో ఆ పిల్లలిద్దరినీ నాతో నా ఇంటికి తీసుకువెళ్ళాను. నేను ఆ సమయంలో ఏమీ పెద్దగా ఆలోచించలేదు. అది నాకు సహజంగా వచ్చింది. అమ్మాయిలు వారు కోరుకున్న రంగంలో స్థిరపరచాలనుకున్నాను. నేనేమీ మల్టీ బిలియనీర్‌ని కాదు, కానీ నేను చేయగలిగినంత సహాయం చేయాలనుకున్నాను.

"నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలను ఏం చేస్తుందో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నందున నన్ను ఎవరూ వివాహం చేసుకోరని అనేవారు. అదృష్టవశాత్తూ నా భర్త (అనిల్ తడాని), అత్తమామలు నా ఇద్దరు పిల్లలను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వారిపై ప్రేమను చూపించారు.

రవీనా తన దత్తత నిర్ణయం గురించి ఏనాడూ విచారించ లేదు. నా కుమార్తెలను చేయి పట్టుకుని నడిపించినప్పటి నుండి, నా మొదటి మనవడిని నా చేతుల్లో పట్టుకోవడం వరకు, ప్రతి క్షణం అమూల్యమైనది. వారు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు, రాషా, రణబీర్‌ని ఎంతో ప్రేమిస్తారు.

"నా కుమార్తెలు నాకు మంచి స్నేహితులు. నాకు గుర్తుంది, నేను వివాహం చేసుకున్నప్పుడు, వారు నాతో పాటు కారులో కూర్చుని నన్ను మండపానికి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు నాకు వారికి పెళ్లి చేసే అవకాశం వచ్చింది. వారిని పెళ్లి కూతుళ్లుగా మండపానికి తీసుకువెళుతున్నాను అని అన్నారు.

21 ఏళ్ళ వయసులో తల్లి కావడం సులభం కాదు

కానీ 21 సంవత్సరాల వయస్సులో తల్లి కావడం అంత సులభం కాదు. ఇది సవాళ్లతో కూడినది. కానీ రవీనా దీనికి సిద్ధంగా ఉంది. ఈ ప్రయాణంలో తన కుటుంబ సహకారం మరువలేనిదని చెప్పింది. "నేను దానిని ఎలా నిర్వహిస్తానో ఆ సమయంలో నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఇద్దరు పిల్లలను పెంచుకోవటానికి వారికి గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నేను ఎలాంటి ఆటంకాలనైనా ఎదుర్కోగలనని అనుకున్నాను. ఆ దిశగానే ముందుకు వెళ్ళాను. నేను ఈ రోజు వారి గురించి చాలా గర్వపడుతున్నాను. అయితే, నా కుటుంబ సహకారం లేకుండా ఇది నేను చేయలేను. "

దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులకు రవీనా సలహా

"మీరు పిల్లలను దత్తత తీసుకోవాలని ఆలోచిస్తుంటే, భయాలతో ప్రారంభించవద్దు. ప్రతికూల ఆలోచనలు ఉండవద్దు. మీరు స్వంత నిర్ణయం తీసుకోండి. మీరు న్యాయం చేయగలరని నిర్ధారించుకోండి. మీరు మీ బిడ్డను పొందినప్పుడు ఆ బిడ్డకు తల్లిదండ్రులు మీరే అనే భావన మీలో కలగాలి. మీరు బలంగా, ధైర్యంగా, కరుణతో ఉంటే పిల్లలను ప్రేమిస్తారు. మీకు భయాలు ఉంటే కనుక దత్తత తీసుకునే అర్హత మీకు లేదు. "

దత్తత పట్ల మన దృక్పథాన్ని మార్చడానికి రవీనా టాండన్, సుస్మితా సేన్, షెఫాలి జారివాలా ఇలా ఎంతో మంది రోల్ మోడల్స్ గా ఉన్నారు. బాక్సింగ్ ప్లేయర్ మేరీ-కోమ్-కుమార్తెను దత్తత తీసుకున్నారు. ఆమెకు ముగ్గురు మగ పిల్లలు. అయితే ఆడపిల్ల కావాలని కుమార్తెను దత్తత తీసుకున్నారు.

Tags

Next Story