Vehicle Registration: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్.. ఎనిమిది రెట్లు ఎక్కువగా..

Vehicle Registration: దేశంలో ప్రాణాంతక స్థాయికి వెళుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్ అమలు చేయనుంది. కొత్త రూల్ పాత వాహన యజమానులను ఒకవిధంగా నిరాశ పరచనుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏప్రిల్ 1, 2022 నుండి, 15 ఏళ్ల వాహనాల రిజిస్ట్రేషన్‌ను 8 రెట్లు ఎక్కువచేయనుంది.
ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు రెండూ కొత్త నిబంధన పరిధిలోకి వస్తాయి. వాహన యజమానులు ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. లేదంటే చాలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వాహనం యొక్క రిజిస్ట్రేషన్ కోసం.
ఇంతకుముందు 15 ఏళ్ల కారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రూ. 600 ఖర్చయ్యేదని, ఇప్పుడు మారిన లెక్కల ప్రకారం రూ. 5,000 ఖర్చవుతుంది. అదే మాదిరిగా గతంలో పాత బైక్‌కు రూ.300 వసూలు చేయగా, ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలకు పెంచారు. ఇది కాకుండా, ట్రక్-బస్సు లాంటి వాహనాలు 15 సంవత్సరాల పాతవైతే 1,500 రూపాయలకు రెన్యువల్ చేయబడేది.
ఇప్పుడు ఈ పనికి 12,500 రూపాయలు ఖర్చు అవుతుంది. మరోవైపు గతంలో చిన్న ప్యాసింజర్ వాహనాలను రెన్యూవల్ చేయించుకునేందుకు రూ.1300 చెల్లించగా, ఇప్పుడు రెన్యూవల్ చేసుకునేందుకు రూ.10వేలు వసూలు చేయనున్నారు. ఇకపై అన్ని ప్రైవేట్, వాణిజ్య వాహనాల విండ్‌షీల్డ్‌పై ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ప్లేట్‌ను ఉంచడం తప్పనిసరి.
ఈ ఫిట్‌నెస్ ప్లేట్ వాహనాల నంబర్ ప్లేట్ లాగా ఉంటుంది, దానిపై ఫిట్‌నెస్ గడువు తేదీ స్పష్టంగా వ్రాయబడుతుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి 1 నెల పాటు ఈ విషయంపై ప్రజల నుండి సూచనలు కోరడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ నియమాన్ని అమలు చేస్తుంది. మరోవైపు, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వాహన యజమానులకు భారీ జరిమానా విధించే నిబంధనను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

