'Reject Zomato' : తమిళుల దెబ్బకు దిగొచ్చిన జొమాటో.. భాషతో పెట్టుకుంటే..

'Reject Zomato' : ఎంత తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రాకపోతే ఎలానండీ.. నాకేమో తమిళ్ రాదు.. మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు.. కస్టమర్‌నుంచి వచ్చిన కాల్‌కి జొమాటో ఎగ్జిక్యూటివ్ సమాదానం అది. దీంతో చిర్రెత్తు కొచ్చిన కస్టమర్ రిజెక్ట్ జొమాటో అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అది కాస్తా ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. జొమాటో ఆ ట్వీట్‌కు ప్రతిస్పందించింది.
తమిళనాడుకు చెందిన వికాష్ అనే కస్టమర్ జొమాటోకి ఆర్డర్ పెట్టాడు. అయితే రిసీవ్ చేసుకున్న తన ఆర్డర్‌లో ఒక వస్తువు మిస్ అయినట్లు గుర్తించి అతను Zomato కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించాడు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వికాష్‌కి 'హిందీ తెలియదు' కాబట్టి అతని వస్తువును తిరిగి పంపించలేమని చెప్పాడు.
"జోమాటో తమిళనాడులో అందుబాటులో ఉంటే, వారు భాషను అర్థం చేసుకున్న వ్యక్తులను నియమించుకోవాలి" అని వికాష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎగ్జిక్యూటివ్.. హిందీ మన జాతీయ భాష. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందీని కొద్దిగా అయినా తెలుసుకోవడం అవసరం అని పేర్కొన్నాడు. దాంతో వికాష్‌కి కోపం వచ్చింది. భారతీయుడిగా నేను హిందీ నేర్చుకోవాలి అనే సంగతి మీరు చెబితే నేను వినాలి అని చాట్ చేసాడు.
అయితే, వికాష్ ఈ మొత్తం ఎపిసోడ్‌లో సంతోషంగా లేడు జొమాటో సంస్థ నుంచి 'క్షమాపణ' కోరాడు. వివాదానికి తెర దించే దిశగా జొమాట్ ఎగ్జిక్యూటివ్‌వి విధుల నుంచి తొలగించి వికాష్‌కి, తమిళ ప్రజలకు క్షమాపణ చెప్పింది జొమాటో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com