దోమలను తరిమేందుకు గుడ్డు పెంకులను కాల్చి..

దోమలను తరిమేందుకు గుడ్డు పెంకులను కాల్చి..
శ్వాస కోశ సమస్యలున్నవారిపై ఈ దోమల నివారణ మందులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.. మరి ఎలా ఈ దోమలు రాకుండా చూడాలి అంటే..

చెవిలో చేరి గుయ్ గుయ్ మంటూ సొద చేసే దోమని చంపుదామంటే ఓ పట్టాన దొరకదు.. ఆ దోమని పట్టుకోడానికి ఓ యుద్ధమే చేయాలి.. ఇంతలో మరో దోమ తయార్.. ఎక్కడి నుంచి వస్తుంటాయో అర్థం కాదు.. తలుపులన్నీ వేసే వున్నా నిద్ర పోనివ్వనీకుండ చంపేస్తున్నాయి అని ప్రతి ఒక్కరూ బాధపడుతుంటారు.. దోమల బ్యాట్లు, రిపెల్లెట్స్ వాడకం కంపల్సరీ అవుతోంది ప్రతి ఇంట్లో. శ్వాస కోశ సమస్యలున్నవారిపై ఈ దోమల నివారణ మందులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.. మరి ఎలా ఈ దోమలు రాకుండా చూడాలి అంటే..

వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులతో పాటు, దోమలూ చంపేస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమలు మానవాళికి పెద్ద ప్రమాదం. వర్షాకాలం దోమలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.

1. సాయింత్రం 6 గంటలలోపే తలుపులు కిటికీలను మూసివేయాలి.. మీ కిటికీలకు, తలుపులకు దోమలు రాకుండా స్క్రీన్లు ఏర్పాటు చేసుకోండి.. ఇవి దోమలు లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ఆ స్క్రీన్ కి ఓ చిన్న రంధ్రం ఉన్నా హ్యాపీగా దోమలు లోపలికి వచ్చేస్తాయి.

2. కోడి గుడ్డు పెంకులు.. ఇది చాలా పాత పద్దతే అయినా దోమల నివారణకు ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను కాల్చితే ఆ పొగకి దోమలు రావు.

3. వెల్లుల్లి నీరు.. ఇంట్లో వెల్లుల్లి నీటిని పిచికారీ చేయడం ద్వారా దోమలనుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతిని ఉపయోగించడానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలతో పాటు 4,5 లవంగాలను తీసుకుని ఆ రెంటిని బాగా దంచాలి. ఆపై వాటిని నీటిలో ఉడకబెట్టాలి. ఓ అయిదు నిమిషాల తరువాత దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఓ స్ప్రే బాటిల్‌లో పోసి మీరు పడుకునే గదితో పాటు, దోమలు తిరుగాడే ప్రదేశాలపై పిచికారీ చేయాలి. ఆశ్చర్యకరంగా ఈ వెల్లుల్లి నీటి దోమల నివారణకు తక్షణ పరిష్కారంగా కనబడుతుంది.

4. నిమ్మ మరియు లవంగాలు..నిమ్మ, లవంగాలు కలిసి దోమల నివారణకు ఓ అద్భుత సాధనంగా పనిచేస్తాయి. ఒక నిమ్మకాయను రెండు ముక్కలు చేసి అందులో కొన్ని లవంగాలను గుచ్చి గదిలో ఉంచండి.

5. లావెండర్ ఆయిల్..లావెండర్ నూనె యొక్క సువాసనను దోమలు భరించలేవు! కావునా దోమలను నివారించడానికి దీనిని కూడా ఉపయోగించవచ్చు. ఇల్లు, పరిసర ప్రాంతాల చుట్టూ లావెండర్ నూనెను పిచికారీ చేయవచ్చు.

Tags

Next Story