Rent payment Fee : క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పే చేస్తున్నారా.. అయితే ఇక నుంచి..

Rent payment Fee : క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పే చేస్తున్నారా.. అయితే ఇక నుంచి..
Rent payment Fee: క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పే చేసే ఐసీసీఐ బ్యాంకు కష్టమర్లపై వేటు వేయనుంది.

Rent payment Fee : క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పే చేసే ఐసీసీఐ బ్యాంకు కష్టమర్లపై వేటు వేయనుంది. ఇకపై ఇలా రెంట్ పే చేసే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని చెబుతోంది బ్యాంకు. రెంట్ పేమెంట్ ఆప్షన్ వినియోగించుకుని చేసే పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని పేర్కొంది. ఈ ఛార్జీలు అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు పేర్కొంది.

క్రెడ్ (CRED), పేటీఎం (Paytm), మ్యాజిక్ బ్రిక్స్ (Magicbricks), రెడ్ జిరాఫీ (RedGiraffe) వంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రెంట్ పేమెంట్ ఆప్షన్ అందిస్తున్నాయి. ఇందుకోసం అర శాతం నుంచి 2 శాతం వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కేవలం ల్యాండ్‌లార్డ్ పేరు, అకౌంట్ వివరాల ఆధారంగా రెంట్‌ను పే చేసేందుకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలు విధించేందుకు ముందుకొచ్చింది.

ఉదాహరణకు రూ.10వేలు రెంట్ పేమెంట్ కోసం 2 శాతం చొప్పున థర్డ్ పార్టీ వేదికలను ఉపయోగించుకుంటే రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులు ఆ మొత్తంపై అదనంగా 1 శాతం ఫీజు చెల్లించాలి. అంటే రూ.102లు అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి రెంట్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే దాదాపు 3 శాతం అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మున్ముందు ఇతర బ్యాంకులు కూడా ఈ తరహా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story