ఆయన్ని కలవడం చాలా సంతోషాన్నిచ్చింది: రేణూ దేశాయ్

తాను తీయబోయే ఓ చిత్రానికి సంబంధించిన పెండింగ్ వర్క్ పూర్తి చేస్తున్నారు రేణూ దేశాయ్. అందులో భాగంగానే ఆ సినిమాలోని ఓ పాట కోసం రచయిత గోరేటి వెంకన్నను కలిశారు.. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్లిన రేణూ.. వారు తనపై చూపిన ప్రేమ ఆప్యాయతలకు పరవశించిపోయాను అని ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. రైతు సమస్యలపై తాను తీస్తున్న చిత్రంలో గోరేటి వెంకన్న చేత పాటలు రాయించుకుందామని ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. నా సినిమాకు ఆయన పాట రాయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఆయన భార్య నా కోసం మట్టి పాత్రల్లో రుచికరంగా అన్నం, పప్పు చేశారు. రోటి పచ్చడి చేశారు. అరటి ఆకులో భోజనం పెట్టారు. సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారితో ఆదివారం మధ్యాహ్నం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడిచింది.. మంచి అనుభూతిని పొందాను అని రేణూ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com