ఫ్యాన్స్ కోసం రేణూదేశాయ్ మళ్లీ..

ఫ్యాన్స్ కోసం రేణూదేశాయ్ మళ్లీ..
ఈ నా ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదం నాకు కావాలి.

రేణూ దేశాయ్ ఏం చేసినా అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు.. పల్లెటూరి వాతావరణం, పచ్చని పంటపొలాలను అమితంగా ఇష్టపడే రేణూ రైతు నేపథ్యంలో ఓ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో తన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.. ఫొటోషూట్ లో తీసిన స్టిల్‌ను షేర్ చేస్తూ మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అక్టోబర్ నెల నుంచి సిరీస్‌కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలిపారు. ఈ నా ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదం నాకు కావాలి.

నిజం కోసం, న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ కథ ఇది అని పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్ పతాకంపై డీఎస్ రావు, ఎన్.రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఎమ్,ఆర్.కృష్ఱ మామిడాల దర్శకుడు. శివేంద్ర డీవోపీగా పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. కాగా తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాకు 'అన్నదాత సుఖీభవ' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు.

Tags

Next Story