కలల్ని కాదనుకుని 16 ఏళ్ల వయసులో అనుకోకుండా..: రేణూదేశాయ్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల కోసం తన మనసుకు నచ్చిన కొన్ని విషయాలు షేర్ చేస్తుంటారు.. 16 ఏళ్ల వయసులో అనుకోకుండా కెమెరా ముందుకు వచ్చానని ఆ రోజును గుర్తు చేసుకున్నారు. నిజానికి తాను నటిని కావాలని ఎప్పుడు అనుకోలేదట.. అంతరిక్ష శాస్త్రవేత్త లేదా న్యూరో సర్జన్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవారట. అనుకోకుండా చిత్ర రంగంలో ప్రవేశించినా తరువాత ఇష్టంగానే నటించానని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 9 1995లో మొట్ట మొదటి ఫోటో షూట్ చేశానని, ఇది జరిగి 25 ఏళ్లు అయిందని.. అప్పుడు దిగిన కొన్ని ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. అందరికీ అనుకున్నవన్నీ జరగవు.. కానీ ఏపని చేసినా మనసు పెట్టి ఇష్టపూర్వకంగా చేయండి.. అప్పుడే రిజల్ట్ బావుంటుంది. విజయం మీ సొంతమవుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నారు. లాక్టౌన్ అనంతరం కొన్ని రియాల్టీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నా రేణూ వాటికి సంబంధించిన షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. మరి కొన్ని ప్రకటనలకు రేణూ దేశాయ్ పని చేస్తున్నారు.
View this post on InstagramA post shared by renu desai (@renuudesai) on
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com