Republic day: కలిసికట్టుగా ముందుకు సాగాలి: ప్రధాని మోదీ

X
By - Subba Reddy |26 Jan 2023 11:30 AM IST
దేశప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర సమరయోధుల కలలు సాకారమవ్వాటంటే అందరూ కలిసి ముందుకు సాగాల
దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల కలలు సాకారమవ్వాటంటే అందరూ కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనదని మెదీ తెలిపారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుల కలలు నిజమవ్వాలంటే మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యుద్ధ స్మారకం వద్ద ఉన్న డిజిటల్ విజిటర్స్ బుక్ లో తన సందేశాన్ని రాశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com