Covid-19: కోవిడ్ తగ్గినా.. ఇమ్యూనిటీతో ఆ కణాల ఫుట్ బాల్

Covid-19: కోవిడ్ తగ్గినా.. ఇమ్యూనిటీతో ఆ కణాల ఫుట్ బాల్
Covid-19: ఈ డెన్డ్రిటిక్‌ కణాలు వ్యాధినిరోధక వ్యవస్థలో చాలా కీలకమైనవి.

Covid-19: కోవిడ్ సోకిన అనంతరం కోలుకున్న వ్యక్తులకు రోగ నిరోధక శక్తి బలహీనపడుతుందని మాక్సి మిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఇమ్యునాలజీ ప్రొఫెసర్ అన్నె క్రూగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు.

వైరస్ సోకిన తరువాత శరీరంలోని రోగనిరోధక శక్తిలోని డెన్డ్రిటిక్‌ అనే కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పని చేయదు. దీని ఫలితంగా సదరు రోగి వైరస్ నుంచి కోలుకున్నా సెకండరీ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరిగిపోతుంది.

ఈ డెన్డ్రిటిక్‌ కణాలు వ్యాధినిరోధక వ్యవస్థలో చాలా కీలకమైనవి. శరీరంలో ప్రవేశించే క్రిములకు వ్యతిరేకంగా వ్యాధినిరోధక వ్యవస్థను ఇవి ప్రేరేపిస్తాయి. ఇవి బి సెల్స్ యాంటీబాడీస్ ను స్రవించి వైరస్ ను నిర్వీర్యం చేస్తాయి.

ప్రొఫెసర్ క్రూగ్ బృందం తీవ్ర లక్షణాలు ఉన్న కోవిడ్ రోగులపై పరిశోధనలు చేసింది. మొత్తం 65 మంది రక్త నమూనాలు సేకరించి వాటిని విశ్లేషించింది. వీరి రక్తంలో డెన్డ్రిటిక్‌ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story