థియేటర్‌లోకి 'కరోనా వైరస్'..

థియేటర్‌లోకి కరోనా వైరస్..
లాక్డౌన్‌లో కూడా సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తూ మొత్తానికి ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉంటారు.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. లాక్డౌన్‌లో కూడా సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తూ మొత్తానికి ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉంటారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ అని ఓ కొత్త సినిమాని తెరకెక్కిస్తున్నారు. థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అన్‌లాక్ 5లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ చేద్దామనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుని థియేటర‌లోకి తీసుకొస్తున్నారు కరోనా వైరస్‌ని. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ప్రారంభించుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేయడం ఆర్జీవీకి కలిసి వచ్చిన అంశం.

లాక్డౌన్ అనంతరం సినిమా హాల్స్‌లో విడుదల కాబోయే మొదటి చిత్రం తమ కరోనా వైరస్ అని వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇక వర్మ తీసిన మరో సినిమా దిశ హత్యోదంతంపై చిత్రీకరించారు. ఈ సినిమా దిశ ఎన్‌కౌంటర్ పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. కరోనా వైరస్ చిత్రాన్ని అగస్త్య మంజు డైరెక్ట్ చేయగా, డీఎస్సార్ సంగీతం సమకూర్చారు.

Tags

Next Story