Bihar : బిహార్ లో పెరుగుతున్న కల్తీ మద్యం మరణాలు..!

Bihar : బిహార్ లో కల్తీ మద్యం మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ సమస్తిపూర్ జిల్లా రూపౌలి గ్రామంలో మరో నలుగురు కల్తీ మద్యానికి బలయ్యారు. డెడ్ బాడీలకు పోస్టుమార్టమ్ నిర్వహించారు పోలీసులు. ఘటనకు బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
మూడు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం కారణంగా చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. మొత్తం గోపాల్ గంజ్, ముజఫర్ పూర్, బెట్టయ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవించారు. 2016 నుంచి బిహార్ లో మద్య నిషేధం అమల్లో ఉంది. వెస్ట్ చంపారన్ జిల్లాలోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.
గోపాల్ గంజ్ జిల్లాలో 17 మంది కల్తీ మద్యానికి బలయ్యారు. కల్తీ మద్యం మరణాలపై శుక్రవారం రివ్యూ నిర్వహించారు సీఎం నితీష్ కుమార్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కల్తీ మద్యం మరణాలు పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. బిహార్ లో మద్య నిషేధం పూర్తిగా విఫలమైందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com