Bus Accident: ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 12 మంది మృతి

Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళుతోన్న ఓ బస్సు నర్మదా నదిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందగా.. 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దాదాపు 50-60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఖల్‌ఘాట్ వంతెన రెయిలింగ్‌లను చీల్చుకుని నదిలో పడిపోయింది. సుమారు 1,000 అడుగుల ఎత్తు నుంచి నర్మదా నదిలో పడిపోయింది.
ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "ప్రమాద స్థలంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ బృందం ఉంది. బస్సు తొలగించబడింది. నేను ఖర్గోన్, ధార్ జిల్లా యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. గాయపడిన వారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి'' అని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం స్థానిక మత్స్యకారుల సహాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇండోర్ మరియు ధార్ నుండి సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com