ఘోర ప్రమాదం.. బ్రేకులు ఫెయిలై 11 కార్లపైకి దూసుకెళ్లిన లారీ

X
By - Nagesh Swarna |13 Dec 2020 1:23 PM IST
బ్రేకులు ఫెయిలై ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. సేలం-బెంగళూరు హైవేపై బ్రేకులు ఫెయిలైన సిమెంటు లారీ.. ముందువెళ్తున్న 11 కార్లపైకి దూసుకెళ్లింది. ఆ ధాటికి వాహనాలన్నీ ధ్వంసమై ఒకదానిమీద ఒకటి పడ్డాయి. ప్రధాన రహదారిపై చెల్లాచెదురుగా వాహనాలు, మృతదేహాలు పడ్డాయి. పది మంది వాహనదారులు ఈ దుర్గటనలో తీవ్ర గాయాలై దుర్మరణం చెందారు.
ఈ భయానక ప్రమాదంతో 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్పాట్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుక్కుతుక్కైపోయిన వాహనాల్ని క్రేన్ సాయంతో పక్కకు తీస్తున్నారు. గాయపడ్డవారికి సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com