కర్నూలు జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు..

తమ వెనకే మృత్యువు కూడా వస్తోందని తెలియని ఆ నలుగురు చిన్నారులు నడుచుకుంటూ వెళుతున్నారు. ప్రార్థనలు చేయడానికి వెళుతున్నవారిని ప్రభువు పరలోకానికి తీసుకువెళ్లాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు-వైఎస్సార్ కడప జాతీయ రహదారిపై ఓ డీసీఎం వాహనం నడుచుకుంటూ వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రిస్మస్ మాస సందర్భంగా క్రైస్తవులు వేకువ జామున ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళుతున్న క్రమంలో వారిపైకి ఒక్కసారిగా లారీ దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారిని స్థానిక ఎర్రగుంట ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది.
మృతి చెందిన చిన్నారులు సుజాత, హర్షవర్థన్, ఝాన్సీ, వంశీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో రహదారిపైన 40 మంది పాదచారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com