ఆవిడ కోసం అర్థరాత్రి అతడు చేసిన పని..

ఆవిడ కోసం అర్థరాత్రి అతడు చేసిన పని..
చూడగానే నచ్చింది.. ఆవిడ కట్టుకుంటే అందంగా ఉంటుందనుకున్నాడు. అందుకే మరో మారు ఆలోచించకుండా దొంగతనానికి పాల్పడ్డాడు.

చీర దొంగిలించి పోలీసుల చేతికి చిక్కాడు మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఓ వ్యక్తి. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. చూడగానే నచ్చింది.. ఆవిడ కట్టుకుంటే అందంగా ఉంటుందనుకున్నాడు. అందుకే మరో మారు ఆలోచించకుండా దొంగతనానికి పాల్పడ్డాడు.

ఎర్ర చీరను అందజేయడం ద్వారా భార్యను ప్రసన్నం చేసుకోవటానికి ఒక వ్యక్తి చేసిన దొంగతనం అతడిని జైలు పాల్జేసింది. నేరం చిన్నదే అయినా, ఉజ్జయిని పోలీసులు అతనిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కేసు పెట్టారు. ఇది ఒక నిర్బంధాన్ని విచారణ లేకుండా 12 నెలల వరకు జైలులో ఉంచడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను అనుమతిస్తుంది.

నిందితుడు విక్కీ గురువారం మాధవ్‌నగర్‌లోని పోలీస్ స్టేషన్‌కి సమీపంలో ఉన్న బట్టల దుకాణం నుండి చీరను దొంగిలించాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, అతడికి షో రూమ్ వాళ్లు బయట బొమ్మకు కట్టిన ఎరుపు రంగు చీర బాగా నచ్చింది. భార్యకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ చీర ఇచ్చి ఆమెను మరింత ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. భార్యకు చీరను బహుమతిగా ఇచ్చి ఆమె ప్రేమకు పాత్రుడవ్వాలనుకున్నాడు. కానీ కొందామంటే అంత డబ్బు తన దగ్గర లేదు. చీరను దొంగిలించడం తప్ప మరో మార్గం లేదనుకున్నాడు.దొంగిలించాడని పోలీసులకు చెప్పాడు. పాపం పూర్ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టి సీసీటీవి కెమెరా కంటికి చిక్కాడు. షాపు యజమాని కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 16 గంటల్లో ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేసి ఇప్పటి వరకు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నాడు. ఈసారి అతడి టైమ్ బాలేదు. చీర కోసం పోలీసుల చేతికి చిక్కాడు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై 16 కేసులు నమోదయ్యాయి అని అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రవిద్ర వర్మ తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story