దేశంలోని ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరణ.. ప్రతిపాదించిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌!

దేశంలోని ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరణ.. ప్రతిపాదించిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌!
ప్రస్తుతం ఓబీసీలకు అమలవుతున్న 27శాతం రిజర్వేషన్లను ఈ నాలుగు కేటగిరీలకు తగు నిష్పత్తిలో ఇవ్వాలని తన నివేదికలో సిఫార్సు..

దేశంలోని ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఓబీసీలకు అమలవుతున్న 27శాతం రిజర్వేషన్లను ఈ నాలుగు కేటగిరీలకు తగు నిష్పత్తిలో ఇవ్వాలని తన నివేదికలో సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేటగిరీ ఒకటి కింద వచ్చే కులాలకు 2శాతం, రెండో కేటగిరీ వారికి 6శాతం, మూడో కేటగిరీ వారికి 9శాతం, నాలుగో కేటగిరీ వారికి 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,633 కులాలు ఉన్నాయి. ఒకటో కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328 కులాలు, నాలుగో కేటగిరీలో 97 కులాలు ఉన్నాయి. అయితే కేటగిరీ ఒకటిలో ఉన్న కులాలు ఇంతవరకు ఎలాంటి రిజర్వేషన్ల ఫలితాలు పొందలేదని కమిషన్ అభిప్రాయపడింది. ఇక నాలుగో కేటగిరీలో ఉన్న తక్కువ కులాలకే ఎక్కువ రిజర్వేషన్లు అమలువుతున్నాయని తెలిపింది.

ప్రస్తుతం కేంద్ర జాబితాలోని ఓబీసీ రిజర్వేషన్లు ఎలాంటి వర్గీకరణ లేకుండా కొందరికే ఎక్కువగా అమలవుతున్నాయి. దీనివల్ల ఓబీసీల్లోని కొన్ని బలమైన వర్గాలు మాత్రమే వాటి ప్రయోజనాలను పొందుతున్నాయి. దీంతో ఓబీసీ వర్గీకరణకు 2017 అక్టోబరు 2న జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. 2018 మార్చి 27కల్లా నివేదిక సమర్పించాలని తొలుత నిర్దేశించింది. అయితే తర్వాత సార్వత్రిక ఎన్నికలతోపాటు, వివిధ రాజకీయ అంశాల కారణంగా 2021 జులై 31లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.



Tags

Read MoreRead Less
Next Story