RSS : పాకిస్థాన్ ప్రజలకు మోహన్ భగవత్ పిలుపు

పాకిస్థాన్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. దేశ విభజన జరిగి 70 సంవత్సరాలు పూర్తయినా పాకిస్థాన్ ప్రజలు బాధలను తప్ప మరేమీ అనుభవించడంలేదని తెలిపారు. విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, "రెడీగా ఉండండి, మన రెండు దేశాలు తిరిగి కలవవచ్చు. అయితే ఇది ఎలా జరుగుతదో నాకు తెలియదు. భారత్ మాత్రం పాకిస్థాన్ పై దాడి చేయదు. అది భారత సంస్కృతి కాదు. ఆత్మరక్షణ కోసమే భారత్ దాడులు చేస్తుంది. అయితే రెండు దేశాలు ఎలా కలుస్తాయో నాక్కూడా తెలియదు . కానీ ప్రజలు అనుకుంటే మాత్రం కలవవచ్చు" అని అన్నారు మోహన్ భగవత్. అఖండ భారత్ నిజమేనని (ప్రస్తుతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు టిబెట్‌లలో ఉన్న అన్ని పురాతన భాగాలతో కూడిన దేశం యొక్క భావన) అయితే విభజించడం ఓ పీడకల" అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com