సబ్రినా @ మేకప్ ఆర్టిస్ట్.. నెలకు రూ.4 లక్షల ఆదాయం

సబ్రినా @ మేకప్ ఆర్టిస్ట్.. నెలకు రూ.4 లక్షల ఆదాయం
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే మొక్కలు నుంచి బ్యూటీ ఉత్పత్తులను తయారు చేయగలిగినప్పుడు ఇక జంతువుల అవశేషాలను ఎందుకు

సుమారు ఏడు సంవత్సరాల క్రితం, సబ్రినా సుహైల్ అనే మేకప్ ఆర్టిస్ట్ తన ఖాతాదారులలో ఒకరు మీ ఉత్పత్తులలో జంతువుల అవశేషాలను మిళితం చేశారా అని అడిగినప్పుడు ఆమె ఆలోచించింది. జంతు ప్రేమికురాలు అయిన తనకి, మేకప్ పరిశ్రమకు జంతువులతో సంబంధం ఉంటుందని సబ్రినా ఎప్పుడూ భావించలేదు. సాధారణంగా తన ఖాతాదారులకు తన ఉత్పత్తుల పట్ల ఏవైనా అనుమానాలు ఉంటే, సబ్రినా తిరిగి వెళ్లి ఆ ఉత్పత్తుల తయారీ విధానాలను అధ్యయనం చేస్తుంది.

ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే మొక్కలు నుంచి బ్యూటీ ఉత్పత్తులను తయారు చేయగలిగినప్పుడు ఇక జంతువుల అవశేషాలను ఎందుకు ఉపయోగిస్తారనేది నాకు చాలా షాకింగ్‌గా ఉంటుంది"అని ఆమె అంటారు. నేను చదువుకున్న కెమిస్ట్రీ, బోటనీ సబ్జెక్టులు నా ఉత్పత్తులను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని సబ్రినా చెప్పారు. మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన 15 సంవత్సరాల తరువాత, సబ్రినా సుహైల్ 2014 లో కాస్మెటిక్ బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది.

ఆమె బెంగళూరుకు చెందిన స్టార్టప్, టింగే ఇప్పుడు సహజ సిద్ధమైన కాస్మెటిక్. మార్కెట్లో పేరెన్నికగన్న ప్రముఖ కాస్మెటిక్ ఉత్పత్తుల సంస్ద. మొదటి మూడు సంవత్సరాలు, సబ్రినా అందానికి సంబంధించిన ఉత్పత్తులను అధ్యయనం చేయడం, వివిధ రకాల ఉత్పత్తులను పరిశోధించడం, వ్యాపారం కోసం అవసరమైన లైసెన్సులను పొందడంపై దృష్టి పెట్టింది. వ్యాపారానికి సంబంధించిన మెళకువలు తెలుసుకుని అధికారికంగా 2018 లో బెంగళూరులో కాస్మెటిక్స్ స్టోర్‌ని ప్రారంభించి వినియోగదారులను ఆకర్షించింది.

కస్టమర్ ముందే తమకు కావలసిన ఉత్పత్తులను తయారు చేసి ఇస్తుంది. వారు ఇష్టపడే రంగు, సువాసనను ఎంచుకునే అవకాశం ఉంది. అదే ఉత్పత్తి మళ్లీ వేరొకరికి అమ్మబడదు అని సబ్రినా చెప్పారు. లిప్ బామ్, లిప్ స్టిక్, ఫౌండేషన్, కన్సీలర్ వంటి అనేక రకాల వేగన్ ఉత్పత్తులను అందిస్తుంది. వారు ఈ ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేస్తారు. టింగే నెలవారీ ఆదాయం రూ .4 లక్షలు.

నోటి మాట ద్వారానే తన బిజినెస్ పెంచుకున్నాని సబ్రినా చెబుతోంది. కస్టమర్లలో నమ్మకాన్ని పెంపొందించడం చాలా ముఖ్యమైనదని సబ్రినా అభిప్రాయపడింది. తన ఉత్పత్తులు స్వంత వెబ్‌సైట్‌తో పాటు, వానిటీ వాగన్, సబ్‌లైమ్ లైఫ్, ఎల్‌బిబితో సహా 15 వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయని త్వరలో నైకాలో కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. "లాక్డౌన్ సమయంలో ఎటువంటి అమ్మకాలు లేవు. అయినా నిరాశ చెందలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యాపారం పుంజుకుంటోంది. భారతదేశం అంతటా దుకాణాలను ప్రారంభించడం ద్వారా టింగే యొక్క రిటైల్ ఉనికిని విస్తరించాలని సబ్రినా భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story