పరీక్ష రాసి అభిమానులను పలకరించి..

పరీక్ష రాసి అభిమానులను పలకరించి..
లాక్టౌన్ సమయాన్నిచక్కగా సద్వినియోగం చేసుకుంది.సాయి పల్లవి. ఓ మంచి విద్యార్థిలా బుద్ధిగా చదువుకుని పరీక్ష రాసింది.

ప్రేమమ్ చిత్రంతో వెండితెరపై మెరిసింది నటి సాయిపల్లవి. అటుపై మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని ప్రతిభగల నటిగా, అద్భుతమైన డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. డాక్టర్ గా రాణించాలని కలలు కన్న సాయి పల్లవి అనుకోకుండా యాక్టర్ అయింది. అయితేనేం అవకాశం వచ్చినప్పుడు రోగులకు సేవ చేయాలనుకుంటోంది. అందుకోసం లాక్టౌన్ సమయాన్ని బుద్దిగా సద్వినియోగం చేసుకుంది.

సాయి పల్లవి జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీ నుండి 2016 లో మెడిసిన్ పూర్తిచేసింది. భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎఫ్‌ఎమ్‌జిఇని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ లేదా ఎఫ్‌ఎమ్‌జిఇ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బిఇ) నిర్వహించిన పరీక్ష. భారతదేశం వెలుపల ఉన్న ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి మెడికల్ కోర్సు పూర్తి చేసిన భారత భారతీయ పౌరులు ఈ పరీక్ష తప్పని సరిగా రాయవలసి ఉంటుంది. పరీక్ష రాసి వస్తున్న సమయంలో అభిమానులు ఆమెను గుర్తించి పలకరించారు. ఆమెతో సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకున్నారు. మేడమ్ మీ డ్యాన్సర్ సూపర్, మీ నటన సూపర్ అంటూ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచేసారు.

సాయి పల్లవి ప్రస్తుతం లవ్ స్టోరీ, విరాటా పర్వం: 1992 లో అనే రెండు తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఆమె సరసన రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'నాది నీది ఒకే కథ' ఫేం వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. టబు, ప్రియమణి, ఈశ్వరి రావు, జరీనా వహాబ్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా, రానా పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అలాగే సాయి పల్లవి మరో చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ. సాయి పల్లవి నాగ చైతన్యతో జత కడుతున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఇందులో చైతూ హైదరాబాదీ యువకుడిగా నటిస్తుంటగా, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది.

Tags

Next Story