నా కోసం మీరు పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు: సల్మాన్

నా కోసం మీరు పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు: సల్మాన్
90లలో వచ్చిన సల్మాన్ మొదటి చిత్రం మైనే ప్యార్ కియా చిత్రంలోని ఎస్పీ బాలు పాడిన పాటలు చిత్రానికే హైలెట్‌గా నిలుస్తాయి.

గత నెల రోజులుగా చెన్నై ఎమ్‌జీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం "త్వరగా కోలుకోవాలని" బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో సోషల్ మీడియాలో ఆయన క్షేమాన్ని కోరుతూ ప్రముఖులు ట్వీట్లు పెడుతున్నారు. 74 ఏళ్ల బాలుకి ఇప్పుడు వైరస్ లేదు కానీ అతని పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. స్టార్ హీరోలందరికీ పాటలు పాడిన ఘనత ఎస్పీకి తగ్గుతుంది. బాలసుబ్రహ్మణ్యం 90లలో వచ్చిన సల్మాన్ ఖాన్ మొదటి చిత్రం మైనే ప్యార్ కియా చిత్రంలోని ఎస్పీ బాలు పాడిన పాటలు చిత్రానికే హైలెట్‌గా నిలుస్తాయి.

పెహ్లా పెహ్లా ప్యార్ హై , దిల్ దీవానా, సాథియా ట్యూన్ క్యా కియా వంటి సల్మాన్ ఖాన్ సినిమాలలో సాజన్, పఠర్ కే ఫూల్ , హమ్ ఆప్కే హై కౌన్, మైనే ప్యార్ కియా చిత్రాల్లో ఆయన పాడిన పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. సల్మాన్ తన ట్వీట్‌లో బాలు గురించి రాస్తూ.."బాల సుబ్రమణ్యం సార్, కోట్ల మంది ప్రజలు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు మరియు మీ దిల్ దీవానా హీరో ప్రేమ్ (సల్మాన్ ఖాన్ యొక్క 1989 చిత్రం మైనే ప్యార్ కియాలో పాత్ర . లవ్ యు, సర్." అని పేర్కొన్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆగస్టు 5 న ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు. గాయకుడు, ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న బాలు ఆరోగ్యంలో కాస్త మెరుగుదల కనిపించింది. కానీ, గురువారం అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిందని ఆసుపత్రి బులెటిన్‌లో తెలిపింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సన్నిహితుడు, నటుడు రజనీకాంత్ గురువారం ఆయనను ఆసుపత్రిలో సందర్శించారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, నిర్మాత-దర్శకుడు ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. చరణ్ తాజా పోస్ట్‌లలో, తండ్రి ఇటీవల ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఆరు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 16 భాషలలో 40,000 పాటలను తన గొంతులో పలికించారు. బాలు ఇళయరాజా, ఎఆర్ రెహమాన్‌తో పాటు మరి కొంత మంది సంగీత దిగ్గజాల వద్ద పనిచేశారు. నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు రంగాలలో అద్భుతమైన ప్రతిభను కనబరిచేవారు. ఎస్పీ బాలు కళామతల్లికి చేసినసేవలకు గాను ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి బిరుదులిచ్చి సత్కరించింది.

Tags

Next Story