రాత్రి రెండు గంటలవుతున్నా నైట్ క్లబ్‌ పార్టీలో స్నేహ..: అల్లు అర్జున్

రాత్రి  రెండు గంటలవుతున్నా నైట్ క్లబ్‌ పార్టీలో స్నేహ..: అల్లు అర్జున్
ఈ క్రమంలో బన్నీ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు, చిన్ననాటి అల్లరి పనులు ఇలా అన్నీ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోను.. కెమెరాతో పన్లేదు.. ప్రతి దృశ్యం ఓ అపురూపం అన్నట్లు అన్నింటనీ సెల్‌లో బంధించేస్తున్నారు. సెల్ఫీలు దిగేస్తున్నారు. మరి పదేళ్ల క్రితం టెక్నాలజీ ఇంత లేదు.. స్మార్ట్ ఫోనూ లేదు.. ప్రేమ ముచ్చట్లు, పెళ్లి ప్రపోజల్స్ అన్నీ వారిద్దరికే సొంతం అన్నట్లు ఉండేది.. ఇప్పుడన్నీ గోడ దూకేస్తున్నాయి.. నలుగురూ వాళ్ల గురించే మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా ప్రతిదీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఫోటోలు, వీడియోలు.. నిమిషాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. మరి మన స్టైయిలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ లవ్ స్టోరీ గురించి అంతగా ఎవరికీ తెలియదు.. అదే విషయాన్ని సామ్ జామ్ షోలో సమంత బన్నీని అడిగింది.

ఈ క్రమంలో బన్నీ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు, చిన్ననాటి అల్లరి పనులు ఇలా అన్నీ చెప్పుకొచ్చాడు. మీ భార్య స్నేహారెడ్డిలో మీకు నచ్చింది ఏంటి అని సమంత అడగ్గా.. ఆమెలో ఉన్న డిగ్నిటీ తనకు బాగా నచ్చుతుందని ఓ సందర్భాన్ని చెప్పాడు.

తాను మొదటి సారి స్నేహాను ఓ నైట్ క్లబ్ పార్టీలో చూశానని, అంత మందిలో కూడా ఆమె చాలా డిగ్నిటీగా కనపించిందని అన్నారు. ఆ సందర్భంలో సమయం రాత్రి రెండు గంటలవుతున్నా కూడా చాలా పద్దతిగా కనిపించడం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

అలాగే కొడుకు అయాన్ గురించి చెబుతూ వాడికి కెమెరాలన్నా, ఫోటోలు తీయడమన్నా నచ్చదు. కానీ కూతురు అర్హకి మాత్రం ఫోటోలు దిగడమంటే చాలా ఇష్టం. ఫోటో తీస్తానంటే చాలు ఫోజులు ఇచ్చేస్తుంది.. అందుకే ఎక్కువ ఫోటోలు అర్హతోనే ఉంటాయని అన్నారు. లేటెస్ట్ సామ్ జామ్‌లో అల్లు ముచ్చట్లు బోలెడు.

Tags

Next Story