మీ వల్లే నేనీరోజు ఇక్కడ..: సమంత

మీ వల్లే నేనీరోజు ఇక్కడ..: సమంత
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అప్పుడప్పుడూ అభిమానులు వేసే ప్రశ్నలకు సమాధానం చెబుతూ మొత్తానికి సమంత హుషారుగా ఉంటుంది.

లాక్డౌన్ పీరియడ్ ని సద్వినియోగం చేసుకుంటూ తనేం చేస్తోంది అనేది ఎప్పటికప్పుడు షేర్ చేసే ఈ బ్యూటీ పెరటి సేద్యం చేస్తూ బోలెడు కబుర్లు పంచుతుంటుంది అభిమానులకు. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇష్టమైన పాత్ర ఏదీ అని అడిగితే.. అలా ఏదీ ఉండదు.. అన్ని పాత్రలను ఇష్టంగానే చేస్తాను.. కాకపోతే గతంలో చేసిన వాటికంటే భిన్నంగా ఉండాలని చూసుకుంటాను అని చెప్పింది. ఐదారేళ్లనుంచి ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కదానికీ జవాబు చెప్పలేదని ఓ అభిమాని అలకబూనితే.. మీ వల్లే నేనిక్కడ ఉన్నా.. సమాధానం చెప్పకుండా ఉంటే క్షమించడండి అని అన్నారు. తాను తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన ఏకం పాఠశాల గురించి మాట్లాడుతూ.. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేలా పాఠశాలను రూపొందించామని చెప్పారు.

Tags

Next Story