'శకుంతల' సమంతకే జైకొడుతుందా..!!

శకుంతల సమంతకే జైకొడుతుందా..!!
మరి సడెన్‌గా ఆ పాత్ర సమంత వద్దకు చేరిందట.

ముందు పూజా హెగ్డే అనుకున్నారు.. ఇప్పుడు ఆ అవకాశం సమంతను వరించనుందని ఇండస్ట్రీలో టాక్.. సరే శకుంతల సమంత అయితే.. మరి దుష్యంతుడెవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సినీ అభిమానుల్లో. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రణయకావ్యం 'శాకుంతలం' పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. పూజా హగ్డే పాత్ర వినగానే ఓకే చేసిందని, రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందని వార్తలొచ్చాయి. మరి సడెన్‌గా ఆ పాత్ర సమంత వద్దకు చేరిందట. అయితే దీనికి సంబంధించిన వార్తలపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను జనవరి నుంచి ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తారు.

విదేశీ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది శాకుంతలం. 1889లో ఈ నాటకం నార్వేజియన్, ఫ్రెంచ్, ఆస్టియన్, ఇటాలియన్ వంటి 46 భాషలలోకి అనువాదం అయింది.

Tags

Next Story