సమంత సరికొత్తగా.. న్యూ ఇయర్ గిప్ట్..

సమంత సరికొత్తగా.. న్యూ ఇయర్ గిప్ట్..
X
ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

వెండి తెరపై వెలిగి పోతున్న సమంత బుల్లి తెరను సైతం ఏలేస్తోంది.. బిగ్‌బాస్ సీజన్ 4లో ఒక రోజు హోస్ట్‌గా అడుగు పెట్టి యాంకర్‌గా మంచి మార్కులే సంపాదించుకుంది. తాజాగా సామ్ డిజిటల్ వేదిక మీద చేస్తున్న షో 'సామ్ జామ్' ప్రశంసలు అందుకుంటోంది. ఇక కొత్త సంవత్సరంలో తనని సరికొత్తగా చూడబోతున్నారంటోంది.

సమంత కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్-2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో సమంత నెగిటివ్ రోల్‌‌లో కనిపించనుంది. తీవ్రవాది పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. రాజ్-డీకే ద్వయం రూపొందించిన ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ తొలి భాగం మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా త్వరలో ఫ్యామిలీ మేన్-2 రాబోతోంది.

Tags

Next Story