చెక్కముక్కలపై 'చైతూ' రిలాక్స్

చెక్కముక్కలపై చైతూ రిలాక్స్
మొత్తం ఏడు చిన్న చిన్న చెక్క ముక్కలపై చైతన్య రిలాక్స్‌డ్‌గా పడుకుని యోగ ముద్రలో ఉన్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

ప్రశాంతంగా ఉండడానికి యోగా, ఫిట్‌గా ఉండడానికి జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ నటీ నటులు తమ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో తన వర్కవుట్లకు సంబంధించిన పోస్టులు పెడుతూ శామ్ అభిమానులను ఆనందపరుస్తుంటుంది. తాజాగా ఓ అభిమాని చైతన్య రిలాక్సింగ్ యోగా పిక్‌ని పోస్ట్ చేమని అడగడంతో ఆ ఫోటోని సమంత షేర్ చేశారు. మొత్తం ఏడు చిన్న చిన్న చెక్క ముక్కలపై చైతన్య రిలాక్స్‌డ్‌గా పడుకుని యోగ ముద్రలో ఉన్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

చైతన్య తన పాదాలు.. వీపు చేతులు, తల మాత్రమే చెక్క ముక్కలపై ఉంచాడు. తాను ధ్యాన ముద్రలో ఎంత ప్రావీణ్యం సంపాదించిందీ ఈ ఫోటో చూస్తే అర్థమవుతోంది. అందుకే అంత కూల్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంటాడేమో చైతూ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరికొన్ని చిత్రాలను కూడా శామ్ అభిమానుల కోసం షేర్ చేసింది. కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన చిత్రం రిలీజ్ కావలసి ఉంది. ఇక సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆహాలో సామ్ జామ్ సక్సెస్‌ఫుల్ షోగా రన్నవుతోంది.

Tags

Next Story