అప్పుడే మూడేళ్లా.. ఏం మాయ చేశావో..

ఏం మాయ చేశావోతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత తన కెరీర్‌ని అందంగా మలచుకుంది.. అక్కినేని వారింటి కోడలై అప్పుడే మూడేళ్లయింది. అక్టోబర్ 6తో సమంత, చైతూల వివాహం జరిగి మూడేళ్లు పూర్తి కాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భర్త నాగ చైతన్యకు మూడవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. దాని కింద ఇలా రాసింది. "మీరు నా వ్యక్తి, నేను మీదానను. జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఇద్దరం కలిసే తీసుకుంటాము.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు."అని పేర్కొంది. సమంతను విష్ చేసిన ఉపసనా కామినేని ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగా, రానా దగ్గుబాటి సమంతను విష్ చేస్తూ "సంతోషంగా, ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పారు.
Annapurna Family wishes @chay_akkineni and @Samanthaprabhu2 a Happy Wedding Anniversary. pic.twitter.com/kUX0iLmUNK
— Annapurna Studios (@AnnapurnaStdios) October 6, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com