Sanganabasava Swamiji: అప్పుడు పునీత్ రాజ్‌కుమార్.. ఇప్పుడు శ్రీసంగన బసవస్వామి..

Sanganabasava Swamiji: స్వామిజీలు తమకు ఇష్టమైన ప్రవచనాలు బోధిస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. అలా ప్రవచనాలు చెప్తూ ప్రజలకు దగ్గరవ్వడం అంటేనే వారికి ఇష్టం. కర్ణాటకకు చెందిన ఓ స్వామిజీ మాత్రం ప్రవచనాలు చెప్తూనే మరణించారు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవస్వామి తన 54వ పుట్టినరోజు సంవర్భంగా ప్రత్యేక ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. అలా చెప్తుండగానే ఆయన ఒక పది సెకండ్లు ఆగిపోయారు. అప్పుడే స్వామిజీకి హార్ట్ ఎటాక్ రావడంతో అదే కుర్చీలో ఒదిగిపోయారు.
ఇది గమనించిన వారు ఆయనను సమీపంలో ఉన్న గోకక్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే స్వామిజీ మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. గుండెపోటుతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com