Sania Mirza: షోయబ్‌కు దూరంగా సానియా.. ఏమైంది?

Sania Mirza: ఇండియన్ ఉమెన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా షోయబ్ మాలిక్‌తో డైవర్స్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఇండియన్ లేడి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇజాన్ అనే కొడుకు ఉన్నాడు.. లేటెస్ట్‌గా సానియా, షోయబ్ విడిపోతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అంతేకాదు షోయబ్‌కు దూరంగా ఇజాన్‌తో ఉంటుంది సానియా.. కొడుకు ఇజాన్కి పేరంట్స్‌గా మాత్రమే ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. వాస్తవం ఏదైనా నెట్టింట ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది..
ఇక సానియా, షోయబ్‌ల పెళ్లి టైం లో కూడా అనేక విమర్శలు వచ్చాయి...ఇండియన్ అయి ఉండి ఓ పాకిస్టానీని ఎలా పెళ్లిచేసుకుంటావని కొందరు పొలిటిషియన్స్ కూడా సానియాను విమర్శించారు.. అయితే ప్రేమకు సరిహద్దులు ఉండవని నిరూపిస్తూ.. సానియా మీర్జా షోయబ్‌ను పెళ్లాడింది... దాదాపు 12 సంవత్సరాల పాటు అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుందట. దీంతో వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై ఇంతవరకు వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు
మరోవైపు తనదైన ఆటతో ఎన్నో రికార్డులు సాధించింది సానియా మీర్జా. డబుల్స్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆమె ఖాతాలో ఆరు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ పొజిషన్‌కి చేరుకున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఉమెన్ సానియా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com