సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులను అర్పించనున్న మోదీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులను అర్పించనున్న మోదీ

సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్రత్ సాదర స్వాగతం పలికారు. అక్కడ్నుంచి గాంధీనగర్ వెళ్లిన ప్రధాని మోడీ.. దివంగత గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఆ తర్వాత ప్రధాని నర్మదా జిల్లా కేవడియా గ్రామానికి చేరుకున్నారు. ఐక్యత విగ్రహం సమీపంలో 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వనాన్ని మోడీ ప్రారంభించారు. గోల్ఫ్ కార్ట్‌లో ప్రయాణించి ఆరోగ్యవనం అందాలను వీక్షించారు. పక్షి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. పావురాలు, రామచిలుకలను వీక్షిస్తూ.. ఉల్లాసంగా గడిపారు. పంజరంలోని పావురాలను బయటికి వదిలారు. అనేక జాతుల పక్షులను ఆసక్తిగా తిలకించారు. వాటిలో కొన్ని రకాల చిలుకలు మోడీ చేతిపై వాలాయి. అనంతరం చిల్ల్రన్ న్యూట్రిషన్ పార్క్ ను ప్రధాని ప్రారంభించారు. అక్కడి న్యూట్రీ రైలులో కాసేపు సరదాగా ప్రయాణించారు ప్రధాని .

భారత సంస్కృతి సంప్రదాయాలు, చేనేత కళలకు అద్దం పట్టే ఏక్తా మాల్‌ను మోదీ ప్రారంభించారు. అక్కడి కళాకృతులను వీక్షించారు. పర్యటనలో భాగంగా కేవడియా-అహ్మదాబాద్ మధ్య సీస్టెయిన్ సేవలను మోడీ ప్రారంభించారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ఘన నివాళులను అర్పించనున్నారు.

Tags

Next Story