ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ

ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ

భారత దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.... 145 జయంతి సందర్భంగా... ప్రధాని మోదీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్‌ ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించారు. దేశంలో కరోనా విజృంభించిన అనంతరం.. ప్రధాని మొదటిసారిగా గుజరాత్‌లో పర్యటించారు. ఐక్యత విగ్రహం వద్ద నిర్వహించిన ఏక్తా దివస్‌ కార్యక్రమంలో పాల్గొని పోలీసుల పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ప్రసగించిన మోదీ... దేశ ఐక్యత, భద్రతను బలోపేతం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రధాని మోదీ రాకతో.. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ విగ్రహం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు.. దేశ వ్యాప్తంగా ఇవాళ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Tags

Next Story