SasiTharoor : అధ్యక్ష బరిలో ఉన్న శశిథరూర్.. హైదరాబాద్ టూర్

SasiTharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ హైదరాబాద్ పర్యటన ఉత్కంఠ రేపుతుంది. ఆయన ఎవరెవరితో భేటీ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు గాను 238 పీసీసీ డెలిగేట్ ఓట్లు ఉన్నాయి.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గేకు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అటు.. శశిథరూర్ రాకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనలో భాగంగా థరూర్ ఎవర్ని కలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ తాజ్‌కృష్ణలో థరూర్ ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఖర్గేకి సపోర్ట్‌గా సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎంపీ చింతామోహన్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల పోటీ చేస్తున్న శశిథరూర్ హైదరాబాద్ పర్యటనగా ఆసక్తిగా మారింది. ఆయన హైదరాబాదుకు వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆయన్ను కలవకుండా దూరంగా ఉన్నారు. తను వచ్చినా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలవకపోవడంతో.. శశిథరూర్ ట్విట్టర్ లో స్పందించారు.
ఆప్తుడు చనిపోవడంతోనే రేవంత్ రాలేకపోయారంటూ... ట్వీట్ చేశారు. రేవంత్ ఆప్తుడి కుటుంబానికి తన సంతాపం తెలిపి శశిథరూర్..... మరోసారి వచ్చి రేవంత్ ను కలుస్తానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అటు... రేవంత్ రెడ్డి మాత్రం... కొడంగల్ టీఆర్ఎస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంలో..బిజీ బీజీగా ఉండటం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com