Satpal Maharaj : మంత్రినా మజాకా.. బాలీవుడ్ పోస్టర్లతో కోటు..!

Satpal Maharaj : పొలిటికల్ లీడర్స్ అంటే ఎక్కువగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.. కానీ ఇక్కడ ఈ మంత్రి మాత్రం కాస్త వెరైటీ దుస్తులు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సత్పాల్ మహరాజ్.. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పర్యాటక, సాంస్కృతిక మరియు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.. అయితే ఇటీవల నోయిడాలో సౌత్ ఏషియన్ లీడింగ్ ట్రావెల్ షోలో పాల్గొన్న ఆయన ధరించి దుస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుర్తా వేసుకున్న ఆయన దానిపైన సినిమా పోస్టర్లతో ఈ కోటు ఉంది. ఆ కోటు పైన నాగిన్, షోలే, సింగమ్, ఖూన్ భారీ మాంగ్, సీతా గీతాతో సహా పలు చిత్రాల పోస్టర్లున్నాయి. అయితే ఆయన ఇలాంటి దుస్తులు ధరించడం కొత్తేమి కాదు.. పలుమార్లు ఇలాగే విభిన్నమైన దస్తులు ధరించి ఆకట్టుకున్నారు. ఇక 1951, సెప్టెంబర్ 21న జన్మించిన ఆయన కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు.. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానులు హెచ్‌డి దేవెగౌడ, ఐకె గుజ్రాల్ పై ఒత్తిడి తెచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com