Satya Pal Malik: రైతు ఆత్మహత్యలపై మేఘాలయ గవర్నర్ సీరియస్ కామెంట్స్..

Satya Pal Malik (tv5news.in)
Satya Pal Malik: రైతు నిరసనలు, అవినీతి విషయాల్లో గత కొన్నాళ్లుగా వరుస షాకింగ్ కామెంట్లు చేస్తున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన జైపుర్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. తాను రైతు నిరసనలపై మాట్లాడినప్పుడల్లా అది వివాదాస్పదమవుతోందన్నారు. దీంతో ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందేమో ఆలోచించాల్సి వస్తోందన్నారు.
ఢిల్లీ నేతలు.. ఒక జంతువు చనిపోయినప్పుడు కూడా సంతాపం వ్యక్తం చేస్తారు. కానీ, కొన్నాళ్లుగా సాగుతున్న నిరసనల్లో దాదాపు 600 మంది రైతులు మరణించినా.. లోక్‌సభలో కనీసం వారి ప్రస్తావన తీసుకురాలేదుంటూ కేంద్ర ప్రభుత్వ నేతలపై పరోక్షంగా విమర్శించారు. అంతేకాదు.. గవర్నర్‌ను తొలగించలేరు. కానీ.. కొంతమంది మాత్రం నేనేమైనా వివాదాస్పదంగా మాట్లాడి పదవి కోల్పోవాలని ఎదురుచూస్తున్నారన్నారు. ఒకవేళ వారు పదవి వదులుకోవాలని కోరితే.. ఒక్క నిమిషం కూడ ఆలస్యం చేయనన్నారు సత్యపాల్ మాలిక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com