ఎస్బీఐ కస్టమర్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి..

దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వారికి శుభవార్త. కరోనా నేపథ్యంలో బ్యాంకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కస్టమర్లు చెక్‌బుక్‌ను వారు కోరుకున్న అడ్రస్‌కి డెలివరీ చేయించుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలిగివుంటే ఆన్‌లైన్ ద్వారా సులభంగా చెక్‌బుక్ పొందవచ్చు. దీని కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయ్యి చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.
బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంతో రిజిస్టర్డ్ అడ్రస్‌లో లేని వారికి ఊరట కలుగుతుంది. వైరస్ కారణంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారికి ఈ వెసులు బాటు ఉపయుక్తంగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. చెక్‌బుక్ కావాలనుకునే వారు ముందుగా నెట్ బ్యాంకింగ్‌తో లాగిన్ అవ్వాలి.
తర్వాత రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత చెక్ బుక్ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎంచుకోవాలి. ఎన్ని చెక్‌లో కావాలో అక్కడ తెలియజేయాలి. తర్వాత సబ్‌మిట్ చేయాలి. ఆపై అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం ఓటపీ ఎంటర్ చేసి ఓకే చేయాలి. ఇప్పుడు మీ చెక్‌బుక్ మీరు పెట్టుకున్న అడ్రస్‌కు వచ్చేస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com