SBI: ఎస్బీఐ అలెర్ట్ మెసేజ్.. ఆ నెంబర్లనుంచి ఫోన్ వస్తే ఎత్తకండి..

SBI: ఎస్బీఐ అలెర్ట్ మెసేజ్.. ఆ నెంబర్లనుంచి ఫోన్ వస్తే ఎత్తకండి..
SBI: కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మెసేజ్ పంపి మీ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది.

SBI: అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్ లైన్ లో పెరిగిపోతున్న మోసాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరిస్తున్నారు. నో యువర్ కస్టమర్ (కేవైపీ) వెరిఫికేషన్ పేరుతో మోసాలకు పాల్పడే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ యోనో పేరుతో మెసేజ్ పంపి మీ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. ఈవిధంగా వారు ఖాతాదారుల అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు.

ఇలా మోసాలకు పాల్పడే వారి నెంబర్లను ఎస్బీఐ ట్విట్టర్ లో పేర్కొంది. కేవైసీ అప్ డేట్ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నెంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించింది. ఈ ఫోన్ నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నంబర్ల నుంచి వచ్చే మెసేజెస్ ను ఓపెన్ చేయవద్దని విన్నవించింది. అంతే కాకుండా ఖాతాదారులు తమ అకౌంట్ డీటెయిల్స్ కానీ, క్రెడిట్, డెబిట్ కార్డుకు సంబంధించిన విషయాల గురించి కానీ ఎవరితో పంచుకోవద్దని తెలియజేసింది.



Tags

Read MoreRead Less
Next Story