కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్..

కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్..
అనధికార లావాదేవీలు జరుగుతున్న్లట్లయితే ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

తమ ఖాతాదారుల భద్రత కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముందడుగు వేసింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఓ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఇకపై డబ్బులు డ్రా చేసినప్పుడే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు, మినీ స్టేట్ మెంట్ తీసుకున్నప్పుడు కూడా మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఈ అలర్ట్ మెసేజ్ కారణంగా అనధికార లావాదేవీలు జరుగుతున్న్లట్లయితే సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలు ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. వీటికి సంబంధించిన మెసేజ్ లను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్బీఐ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story