పండగ సీజన్.. కస్టమర్లకు ఎస్బీఐ భారీ ఆపర్లు

పండగ సీజన్.. కస్టమర్లకు ఎస్బీఐ భారీ ఆపర్లు
ఎస్పీఐ యోనో యాప్‌లో ఆటోమొబైల్, గోల్డ్, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకునే కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజును

రానున్న పండగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని దేశీయ బ్యాంకు ఎస్పీఐతో పాటు పలు బ్యాంకులు రుణాలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్పీఐ యోనో యాప్‌లో ఆటోమొబైల్, గోల్డ్, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకునే కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. గృహాలు కొనుగోలు చేసేవారి రుణాలపై కూడా ప్రాసెసింగ్ ఫీజును నూటికి నూరు శాతం మాఫీ చేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసిన కస్టమర్లకు వడ్డీ రేట్లలో 10 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ కల్పించనుంది.

ఇక ఎస్బీఐ యోనో పై గృహ రుణానికి దరఖాస్తు చేసుకున్న వారికి అదనంగా వడ్డీరేటుపై మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని ప్రకటించింది. గోల్డ్ లోన్‌లకు దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు 7.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల్లోగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ వసూలు చేయనున్నట్లు బ్యాంకు పేర్కొంది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసే కారు, గృహ రుణాల దరఖాస్తులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతామని ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్‌పై వ్యక్తిగత రుణానికి ఆమోదం పొందవచ్చని తెలిపింది.

Tags

Next Story