SBI Positive Pay: ఎస్‌బీఐ పాజిటివ్ పే.. మోసాలకు చెక్..

SBI Positive Pay: ఎస్‌బీఐ పాజిటివ్ పే.. మోసాలకు చెక్..
X
SBI Positive Pay: ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు వీలుగా బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి కస్టమర్లను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూనే ఉంటాయి.

SBI Positive Pay: ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు వీలుగా బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి కస్టమర్లను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగానే ఎక్కువ మొత్తంతో కూడిన బ్యాంకు చెక్కులకు సంబంధించి మోసాలు జరగకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ పాజిటివ్ పే సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. భద్రత కోసం కస్టమర్లు పాజిటివ్ పే సిస్టమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరింది.

పాజిటివ్ పే అనేది ఎక్కువ మొత్తంతో కూడిన చెక్కులపై క్లిష్టమైన డేటాను నిర్ధారించే విధానం.. చెక్కును జారీ చేసేవారు చెక్కు తేదీ, లబ్ధిదారుని పేరు, మొత్తం.. తదితర కనీస వివరాలను మెసేజ్, మొబైల్ యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ ఛానెల్ ద్వారా డ్రాయీ బ్యాంకుకు అందజేస్తారు. CTS అందజేసిన చెక్కుతో ఆ వివరాలను క్రాస్ చెక్ చేస్తారు.

పాజిటివ్ పే సిస్టమ్ సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే కస్టమర్లు బ్యాంక్‌ను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్, రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్‌తో కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ ద్వారా అయితే..

ముందు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అయ్యి.. చెక్ బుక్ సర్వీస్‌పై క్లిక్ చేయాలి. రిజల్ట్స్‌లో కనిపించే పాజిటివ్ పేమెంట్ సర్వీసెస్‌పై క్లిక్ చేసి అకౌంట్ నెంబర్ సెలక్ట్ చేసుకోవాలి. అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. పాజిటివ్ పే పోర్టల్‌లో కస్టమర్ నమోదు చేసిన సమాచారంతో చెక్ వివరాలను సరిపోలుస్తారు.

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కస్టమర్‌లు రిజిస్ట్రేషన్ కోసం అకౌంట్ లెవెల్ లిమిట్ ఎంచుకోవాలి. ఇది కస్టమర్‌ల నిర్ణయం మేరకు ఎంతైనా కావచ్చు. అయితే రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ చెక్కులకు, రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని ఇతర అకౌంట్‌ల చెక్కులకు పాజిటివ్ పే సిస్టమ్‌ని తప్పనిసరి చేయాలని బ్యాంక్ యోచిస్తోంది.

Next Story