Supreme Court: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Supreme Court: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.. నోట్ల రద్దును ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది..

Supreme Court: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.. నోట్ల రద్దును ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది.. జస్టిస్‌ ఎన్‌ఏ నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.. అయితే, కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. ఈ విధానాన్ని నలుగురు సభ్యులు సమర్థించగా.. మరో న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న విభేదించారు..



మొత్తంగా 4-1 మెజారిటీతో నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని జస్టిస్‌ గవాయ్‌ చెప్పారు.. ఆర్బీఐ, కేంద్రం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తీర్పులో వెల్లడించారు. దామాషా ప్రకారం నోట్ల రద్దు ప్రక్రియను కొట్టివేయలేమని చెప్పారు.. నోట్ల మార్పిడికి నిర్దేశించిన 52 రోజుల వ్యవధి అసమంజసమని చెప్పలేమన్నారు జస్టిస్‌ గవాయ్‌.


కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దాఖలయ్యాయి.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ నజీర్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన రికార్డ్స్‌ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐని డిసెంబర్‌ 7న ఆదేశించింది.. సుదీర్ఘ విచారణ తర్వాత తుది తీర్పును వెలువరించింది.


2016 నవంబర్‌ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 2016 డిసెంబర్‌ 16న అప్పటి చీఫ్‌ జస్టిస్ ఆఫ్ ఇండియా టీఎస్ ఠాకూర్‌..ఈ పిటిషన్‌ల విచారణను ఐదుగురు సభ్యుల బెంచ్‌కు బదిలీ చేశారు. ఈ పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం..పూర్తి స్థాయి వివరాలతో అఫిడవిట్‌ సమర్పించాలని అక్టోబర్‌ 11న కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు..ఆర్బీఐ బోర్డు నిర్ణయాలు..నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించిన ఫైళ్లను సమర్పించాలని ఆదేశించింది. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పును వెల్లడించిన ధర్మాసనం.. దీనిపై దాఖలైన 58 పిటిషన్లను కొట్టివేసింది.

Tags

Read MoreRead Less
Next Story