Odisha: స్కూల్‌కు సెలవు కావాలి..! అందుకే స్నేహితులకు విషమిచ్చి..

Odisha: స్కూల్‌కు సెలవు కావాలి..! అందుకే స్నేహితులకు విషమిచ్చి..

ప్రతీకాత్మక చిత్రం

Odisha: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

Odisha: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక విద్యార్థుల విషయానికొస్తే గత కొన్నిరోజులగానే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఒమిక్రాన్ టెన్షన్ మొదలయిపోయింది. కానీ ఇటీవలనే స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువును ద‌ృష్టిలో పెట్టుకుని సెలవులు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. దీంతో సెలవుల కోసం ఓ 11వ తరగతి విద్యార్థి చేసిన పనికి స్కూలు యాజమాన్యం ఆశ్చర్యపోయింది.

ఒడిశాలోని బర్‌గార్‌ జిల్లాకు చెందిన కామగాన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్‌ల్లో 11వ తరగతి విద్యార్థి అదే స్కూల్‌కు సంబంధించిన హాస్టల్‌లో ఉంటున్నాడు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అప్పటిలాగానే చాలా సెలవులు దొరుకుతాయేమో అని ఆశించాడు ఆ విద్యార్థి. కానీ అలా జరగకపోవడంతో సెలవుల కోసం ఓ ప్లాన్ వేశాడు. ఆ విద్యార్థి స్కూల్‌కు విషాన్ని తీసుకొచ్చి తన 20 మంది స్నేహితుల వాటర్ బాటిల్‌లో కలిపేశాడు.

ఆ నీళ్లు తాగిన విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ప్రమాదం నుండి బయటపడ్డారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది అని ఆరా తీయగా ఓ విద్యార్థి ఇదంతా చేశాడని బయటికి వచ్చింది. అతడిని ప్రశ్నించగా తాను కూడా నిజాన్ని ఒప్పుకున్నాడు. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అతడిపై కేసు పెట్టాలనుకున్నారు. కానీ అతడు ఇంకా చిన్నపిల్లవాడని, కేసు పెడితే తన భవిష్యత్తుపై ప్రభావం పాడుతుందని స్కూల్ యాజమాన్యం వారిని ఒప్పించారు. అతడిని కొన్నిరోజుల పాటు స్కూల్ నుండి సస్పెండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story