7కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారు..

కౌన్ బనేగా కరోర్‌పతి 12 సీజన్‌లో రెండవ సారి కోటి రూపాయలను గెలుచుకున్న మహిళగా ఐపిఎస్ అధికారి మోహితా శర్మ నిలుస్తున్నారు. ఢిల్లీకి చెందిన నజియా నాసిమ్ 1 కోటి రూపాయలు గెలుచుకున్న కొద్ది కాలానికే, సోనీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో ఎంఎస్ శర్మ కెబిసి 12వ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న రెండవ మహిళగా మారిందని ప్రకటించింది. ఆమె సాధించిన విజయానికి సంబంధించిన ఎపిసోడ్ నవంబర్ 17 న ప్రసారం అవుతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎపిసోడ్ యొక్క స్నీక్ పీక్, ఐపిఎస్ అధికారి మోహితా శర్మ క్విజ్ షోలో అడిగిన ప్రశ్నకు కోటి రూపాయలు గెలుచుకునే సమాధానం ఇచ్చినట్లు చూపిస్తుంది. " కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి 7 కోట్ల జాక్‌పాట్ కొట్టేయడానికి 16వ ప్రశ్నలోకి శర్మ అడుగుపెట్టినట్లు ప్రోమోలో చూపిస్తున్నారు.
శర్మ ఆ ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పిందో లేదో తెలియదు కాని ఆమె ముఖంలో ఆనందం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఐపిఎస్ ఆఫీసర్‌గా ఆమె జీవితానికి సంబంధించిన వీడియో ప్లే చేయబడింది. ఈసారి అమితాబ్ చాలా కొద్ది మందికి మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుందని వెల్లడించారు. ఐపిఎస్ అధికారి రూ.7 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నారా లేదా అనేది నవంబర్ 17 నాటి ఎపిసోడ్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com